గురుపౌర్ణమి సందర్భంగా వేల్పుల వీధి లో ప్రత్యేక పూజలు

అనకాపల్లి వాస్తవ నయనమ్


అనకాపల్లిలో గురుపౌర్ణమి సందర్భంగా స్థానిక వేల్పుల వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయి నాథ్ స్వామివారిని ప్రముఖ వైద్యులు మరియు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి దంపతులు దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ శిరిడి సాయి నాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎల్లవేళలా మాస్క్ ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలని సూచించారు.శ్రీ శిరిడి సాయి నాథ్ ఆలయ చైర్మన్ బుచ్చిరాజు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉగ్గినా అప్పారావు, గొర్లి చిన్న పాల్గొన్నారు.