- కరోనా నియంత్రణలో సేవలు ప్రశంసనీయం
- విజేఫ్ ప్రెస్ క్లబ్ లో శానిటైజర్ యంత్రం ప్రారంభం
- పలువురికి మాస్కులు,శానిటైజర్లు పంపిణీ
విశాఖపట్నం వాస్తవ నయనమ్
కరోనా నియంత్రణలో జర్నలిస్టుల సహకారం కృషి మరుపు రానిది అని విశాఖ ఎంపీ ఎంవివీ సత్యనారాయణ కొనియాడారు.ఆదివారం ఉదయం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లోబ్యాంకు ఆఫ్ బరోడా అందించిన సానిటైజర్ యంత్రాన్ని ఎంపీ ఎంవీవీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.నిరంతరం సమాజం కోసం పాటు పడే జర్నలిస్టులకు ఇన్సూరెన్స్,పెన్షన్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రికి తాను నివేదించడం జరుగుతుంది అన్నారు.పాత్రికేయుల సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.గౌరవ అతిధి గా హాజరైన ఏపి ఈపీడీసీఎల్ డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా లో జర్నలిస్టుల సేవలు అభినందనీయం అన్నారు.విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులు ప్రజలు కు నిరంతరం సమాచారాన్ని అందజేస్తూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారన్నారు.బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ హెడ్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ తమ సంస్థ 113వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.అందులో భాగంగానే వైద్యులు,పోలీసులు తదితర సేవా పరులను ఘనంగా సత్కరిస్తున్నామన్నారు.వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు మాట్లాడుతూ సభ్యులు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ఇప్పటి వరకు ఆరు విడతలుగా మాస్కులు,శానిటైజర్ లు పంపిణీ చేశామన్నారు.ఇప్పుడు బ్యాంకు ఆఫ్ బరోడా,సౌజన్యంతో ఏడో విడత గా మమాస్క్ లు,సానిటైజర్ లు అందజేయడంతో పాటు సానిటై జేషన్ యంత్రం ప్రారంభించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమం లో విజేఫ్ ఉపాద్యక్షులు అర్ నాగరాజు పట్నాయక్,టీ నానాజీ,జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కోశాధికారి మూర్తి,బ్యాంకు అఫ్ బరోడా డిఆర్ఎంలు టి శేషుకుమార్,బాపూజీ రావు,చీఫ్ మేనేజర్ ఏవీ భాస్కరం,సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రావు,విజేఫ్ కార్యవర్గం సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు,వరలక్ష్మి,ఎంఎస్అర్ ప్రసాద్,డేవిడ్ గయాజ్,శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.