ఘనంగా డాక్టర్ రామ్మూర్తి జన్మదిన వేడుకలు

 


అనకాపల్లి వాస్తవ నయనమ్


వైఎస్ఆర్సిపి నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి రామ్మూర్తి జన్మదిన సందర్భంగా డాక్టర్ రామ్మూర్తి మిత్ర మండలి ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు డాక్టర్ రామ్మూర్తి దంపతుల చేతుల మీదగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రామ్మూర్తి మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి రామ్మూర్తి అని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిన అప్పారావు,గొన్నబత్తుల వెంకటరమణ, పిలా శ్రీను, మళ్ల రామారావు,కన్నె ఈశ్వరరావు, ఎం జగ్గారావు, డాక్టర్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.