- ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.
- జీవీఎంసీ గుర్తింపు యూనియన్ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల
విశాఖపట్నం వాస్తవ నయనమ్ : మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని జీవీఎంసీ గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం ఆనందరావు అన్నారు.
బుధవారం ఇక్కడ గుర్తింపు యూనియన్ కార్యాలయంలో డాక్టర్ వైయస్ఆర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు,తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆనంద్ రావు మాట్లాడుతూ వైయస్ ముఖ్యమంత్రిగా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు.వారి సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టార న్నారు.విద్య,వైద్యం తో పాటు స్థానిక సంస్థల బలోపేతానికి వైఎస్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.జీవీఎంసీకి జెఎన్ఎన్ యు ఆర్ఎం పథకం ప్రాజెక్ట్ ల కింద ఒకేసారి 2000 కోట్లు మంజూరు చేసిన ఘనత వైయస్ కే దక్కుతుందన్నారు.యూనియన్ ప్రధాన కార్యదర్శి లంక భాస్కరరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి వైయస్ ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.గుర్తింపు యూనియన్ గౌరవ సలహాదారు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్ కే దక్కుతుందన్నారు.వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రతి ఒక్కరి మనసులోనూ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయంగా మిగిలిపోయారన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి సైతం వైయస్సార్ నిరంతరం కృషి చేశారని.ఇళ్ల స్థలం లు ఇవ్వడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రెల్లి సత్యం కింతాడ శ్రీను,జి రామకృష్ణ,కుమార్,పరమేష్,శ్రీను దుర్గావతి,పెద్ద ఎత్తున ఉద్యోగులు.. కార్మికులు పాల్గొన్నారు