వేల్పుల వీధిలో ఘనంగా వైస్సార్ జయంతి

అనకాపల్లి వాస్తవ నయనమ్


83వ వార్డు వైస్సార్సీపీ  కార్పొరేటర్ అభ్యర్థి జాజుల రమేష్ పర్యవేక్షణలో వేల్పుల వీధి 6వ వార్డు లో ఉగ్గిన అప్పారావు ఆధ్వర్యంలో సిద్ధి లింగేశ్వర మాజీ చైర్మన్ బోండా శంకర్రావు ఆర్థిక సాయంతో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా 60 మంది పేదలకు చీరలు,దుప్పట్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి రామ్మూర్తి,పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామ్ రాజుగా,మాజీ కౌన్సిలర్ కొణతాల మురళి కృష్ణ హాజరయ్యారు.ముఖ్య అతిథులు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విన్నకోటరాజా సతీష్,ఆళ్ల నాగేశ్వరరావు,బోండా వాసు, గొర్ల చిన్న, మద్దాల చలపతి,కొంకి శ్రీరామ్మూర్తి,వేల్పుల గణేష్,నూకరాజు,రాజేష్,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు వేల్పుల వీధి పెద్దలు,యువకులు పాల్గొన్నారు.