ఘనంగా 54వ సర్వేయర్ల సంఘం వ్యవస్థాపక దినోత్సవం

అనకాపల్లి వాస్తవ నయనమ్
స్థానిక అనకాపల్లి తాసిల్దార్ కార్యాలయంలో 54వ సర్వేయర్ల సంఘ వ్యవస్థాపక దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేయర్ల సంఘ వ్యవస్థాపకులు జి పట్టాభి రామయ్య చిత్రపటానికి కి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ వెంకట్ మాట్లాడుతూ సర్వేయర్ల సంఘం స్థాపించడానికి పట్టాభి రామయ్య ఎంతో కృషి చేశారన్నారు. జిల్లా సర్వేయర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ కడలి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ పట్టాభి రామయ్య సేవలు ఎనలేనివి ఆయన ఉన్నంత కాలం సంఘ అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడ్డారని చెప్పడంలో సందేహం లేదన్నారు. పట్టాభి రామయ్య స్ఫూర్తితో మేము  కూడా సంఘానికి సేవలు చేస్తున్నామన్నారు. కొత్తగా వీధుల్లోకి వచ్చిన వారికి పట్టాభిరామయ్య స్ఫూర్తిదాయక అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ లీల,లైసెన్స్డ్ సర్వేయర్లు అర్జున్, నాగేశ్వరరావులు, కమ్యూనిటీ సర్వేయర్ గుణశేఖర్, మండల వి ఆర్ వో లు, విలేజ్ సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.