పోర్ట్ కార్మికులకు న్యాయం చేయండి

  • క్యాజువల్స్ కు  పని వేతనం కల్పించండి

  • కేంద్ర మంత్రి తో ఎంపీ ఎంవీవీ


విశాఖపట్నం వాస్తవ నయనమ్ : విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో గత 12 ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులకు న్యాయం చేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.ఈ మేరకు మంగళవారం కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి ఎం మాండవీయ దృష్టికి పలు పెండింగ్ అంశాలను ఎంపీ తీసుకువెళ్లారు.కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని మంత్రి కి తాజాగా  తెలియజేశారు.డి ఎల్ బి నుంచి వీరంతా  పోర్ట్ లో విలీనం ఐయ్యారని ఐతే ఏళ్లు గడుస్తున్నా నేటికీ వీరికి సరైన పని లేకుండా పోవడం వల్ల కుటుంబంలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రికి  నివేదించారు.తక్షణమే పోర్టులో ఖాళీగా ఉన్న పనులకు వీరిని వినియోగించుకోవాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఎంవీవీ  చెప్పారు.ఇందుకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని అన్ని విషయాలు తాజాగా లేఖ ద్వారా కూడా తెలియచేశామన్నారు.త్వరలోనే వీరి సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర మంత్రి ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఎంపీ ఎంవీవీ తెలిపారు.పోర్ట్ క్యాజువల్ కార్మికుల కోసం చైర్మన్ కె రామ్మోహన్ రావు,డిప్యూటీ చైర్మన్ హరినాథ్లతో కూడా చర్చించినట్లు ఎంపీ ఎంవీవీ చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీ ని కార్మిక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,క్యాజువల్ కార్మికుల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ,గోపి,కృష్ణ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.