కశింకోట వాస్తవ నయనమ్
అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలంలో సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు మృతి చెందిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ కన్వీనర్ సుందరపు విజయ్ కుమార్ మృతుల కుటుంబీకులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం పాలసీ తప్పుల వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని అన్నారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పకుండా నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఇందులో భాగంగా రేపు అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో మరియు విశాఖ జిల్లా కలెక్టర్ ను కలవబోతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ లీడర్స్ సభ్యులు మంగా ఈశ్వర్, అనకాపల్లి పట్టణ జనసేన నాయకులు తాడి రామకృష్ణ, భరణికాన రాము,దూలం గోపి,అప్పికొండ గణేష్,కొడుకుల శ్రీకాంత్,బుద్ధ రాందాస్,విళ్లూరి హరి,తాడి చక్రవర్తి,కశింకోట మండల నాయకులు పావాడ కామరాజు,బొబ్బరి పవన్,చిరంజీవి, నాయుడు,బీజేపీ నాయకులు ఎంఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.