సింహగిరిపై ప్రారంభమైన దర్శనాలు


  • తొలిరోజు ఉద్యోగులు.. స్థానిక ప్రజలకే అవకాశం

  • అన్ని జాగ్రత్తలు తీసుకున్న  ఆలయ వర్గాలు


సింహాచలం వాస్తవ నయనమ్: 
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.లాక్ డౌన్ నేపథ్యంలో సుదీర్ఘకాలంపాటు స్వామి దర్శనం భక్తులుకు లభించలేదు.స్వామికి అన్ని సేవలు ఏకాంతంగానే నిర్వహించారు.తాజాగా ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో సోమ,మంగళ వారాల్లో దేవస్థానం ఉద్యోగులు స్థానిక గ్రామ ప్రజలకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. బుధవారం నుంచి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించనున్నారు.ట్రస్ట్ బోర్డు సభ్యులు వారణాసి దినేష్ రాజు,సూరి శెట్టి సూరి బాబు,చిప్పిల్ల ఆశా కుమారి,జి మాధవి,స్థానిక గ్రామస్తులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,ఎస్ ఎన్ ఆర్ అధినేత బి వి కృష్ణారెడ్డి, తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆలయ వర్గాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి.ఈ సందర్బంగా శ్రీనుబాబు మాట్లాడుతూ చాలా కాలం తరువాత స్వామిని దర్శించు కోవడం ఆనందం గా ఉందన్నారు.గతంలోస్వామి కళ్యాణం,చందనోత్సవం సమయం లో గ్రామ ప్రజలు కు ప్రతేక్యముగా స్వామి  దర్శనం కలిపించేవారన్నారు.ఇప్పుడు గ్రామ ప్రజలు కు రెండు రోజులు పాటు స్వామి దర్శనం కల్పించడం అభినందనీయం అన్నారు.ఆలయ వర్గాలు కు శ్రీనుబాబు ప్రతేక ధన్యవాదములు తెలిపారు.