- గ్రహాల అనుకూలత తో త్వరలోనే విపత్తు అధిగమిస్తాం
- విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
విశాఖపట్నం వాస్తవ నయనమ్
కరోనా విపత్తులో జర్నలిస్టులు అందించిన సేవలు ప్రశంసనీయమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కొనియాడారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో బుధవారం పలువురు స్వరూప నందేంద్ర స్వామి ఆశీస్సులు పొందారు.తదుపరి స్వరూపానందేంద్రను ఘనంగా సత్కరించారు.సింహాద్రి నాధుని చిత్రపటాన్ని బహూకరించారు.ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కరోనాలో వైద్యులు,పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తోపాటు మీడియా కూడా ఎనలేని సేవలు అందించింది అన్నారు.గ్రహాల అనుకూలత తో కరోనా క్రమేపీ కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు.ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని స్వామీజీ సూచించారు.స్వరూప నందేంద్ర ను కలుసుకున్న వారిలో దేవాలయంల రాష్ట్ర అధ్యక్షులు రామరాజు.అర్ కే అధినేత బీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గున్నారు.