కేంద్రం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

  • ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తా

  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తా

  • విజేఫ్ కార్యవర్గంతో విశాఖ ఎంపీ  ఎంవీవీ  సత్యనారాయణ


విశాఖపట్నం వాస్తవ నయనమ్: కరోనా విపత్తులో నిరంతరము సమాజ అభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని కోరనున్నట్లు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చెప్పారు.గురువారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కార్యవర్గం ఎంపి ఎంవీవీ ని కలిసి జర్నలిస్ట్ లు ఎదురుకొంటున్న పలు సమస్యలు నివేదించింది.ప్రధానంగా జర్నలిస్టులకు 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని విజేఫ్ కార్యవర్గం కోరగా అందుకు ఎంవీవీ సాను కూలంగా స్పందించారు.వైద్యులు,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికుల తో సమానంగా జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారని కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని కేంద్రానికి నివేదిస్తా అన్నారు.జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారని దీంతోపాటు అక్రిడేషన్ కార్డ్స్ పొందగానే రైల్వే పాస్ లు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి  కూడా నివేదించడం  జరుగుతుందన్నారు.ఇళ్ల స్థలాల కేటాయింపు కు సంబంధించి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.విజేఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు  మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ  పాలకవర్గం పనిచేస్తుందన్నారు.జర్నలిస్టులకు ఇన్సూరెన్స్,పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి,ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో విజేఫ్ ఉపాధ్యక్షుడు ఆర్ నాగరాజు పట్నాయక్,జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్,వరలక్ష్మి,గిరిబాబు,గయాజ్,డేవిడ్. తదితరులు ఫాల్గున్నారు.


మనోజ్ మృతికి విజేఫ్  సంతాపం
కరోనా లో సైతం విధులు నిర్వహించి తన  ప్రాణాలు పోగొట్టుకున్న జర్నలిస్ట్ మనోజ్ మృతి పట్ల వైజాగ్
జర్నలిస్టుల  ఫోరం కార్యవర్గం సంతాపం వ్యక్తం చేసింది.మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని కార్యవర్గం ఆకాంక్షించింది.ఈ సందర్బంగా ఘన నివాళులు అర్పించింది.కరోనా లో జర్నలిస్టులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని  కార్యవర్గం కోరింది.