వరాహ స్వామి అలంకరణలో జగన్నాథుడు

వాస్తవ నయనమ్ విశాఖపట్నం: టౌన్ కొత్త రోడ్ లో కొలువున్న బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి శుక్రవారం వరాహ స్వామి అలంకరణలో తన భక్తులుకు దర్శన భాగ్యం కల్పించారు.కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రథోత్సవాన్ని నిర్వహించలేదు.దీనితో ఆలయంలోనే స్వామి దర్శనం కల్పిస్తున్నారు.తెల్లవారుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజా కార్యక్రమంలు నిర్వహించారు.ఆ తర్వాత అందంగా జగన్నాధుడుని అలంకరించి ఆలయంలోనే వరాహ స్వామిదర్శనం ఏర్పాటు చేశారు.ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులకు జగన్నాథుడు స్వామి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శిరీష తెలిపారు.భక్తులు అందరూ విధిగా మాస్కులు ధరించి స్వామిని దర్శించుకోవాలని కోరారు.అన్ని జాగ్రత్త లు తీసుకొని ఏర్పాట్లు చేశామన్నారు.ఆలయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.స్వామిని దర్శనం చేసుకొనే భక్తులుకు ఏర్పాట్లు చేసారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పలువురు భక్తులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.