పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. కరోనాతో ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. కానీ కేంద్రం ఈ సమయంలో ఎక్సైజ్ సుంకాన్ని పెంచేందుకు నిర్ణయించింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటరుపై సుమారు రూ.10 నుంచి రూ.15 మధ్య పెరిగే అవకాశం ఉన్నది. దీనితో పాటు రోడ్డు సెష్ రూపంలో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటరకు 8 రూపాయలు పెంచనున్నారు. పెట్రోల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయలు పెంచారు. డీజిల్‌పై రూ.5 పెంచారు. దీని వల్ల కేంద్ర ఖజానా భారీగా నిండనున్నది. పెరిగిన ఎక్సైజ్ సుంకం ద్వారా సుమారు లక్షా 75వేల కోట్లు వచ్చేఅవకాశాలు ఉన్నాయి. రిటేల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం..