అనకాపల్లి వాస్తవ నయనమ్: పట్టణ వైస్సార్సీపీ నాయకులు కోరుకొండ రాఘవ తనయుడు దీక్షిత్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందిపడుతున్న 30 పేద బ్రాహ్మణ కుటుంబాలుకు నిత్యావసర సరుకులు,కాయగూరలు, బియ్యం పంపిణి చేసారు.అనంతరం పండితులు వేద మంత్రాలతో దీక్షిత్ బాబును ఆశీర్వదించారు.లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు కోరుకొండ రాఘవ అనేక సేవ కార్యక్రమాలు చేసారు.ఈ సేవ కార్యక్రమాలకు పలువురు హర్షం వ్యక్తం చేసారు.