విశాఖపట్నం వాస్తవ నయనమ్
ఈ రోజు తాసుబెల్లి ఫౌండేషన్ ఆల్ ఇండియా బ్లడ్ సర్వీస్ చేస్తుంది.తాసుబెల్లి ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బ్లడ్ సర్వీస్ లో ఫౌండేషన్ కు ఒక గుర్తింపు వచ్చింది అంటే దానికి క్రియ,కర్మ,కర్త అంతా రక్తదాతలు,వాలెంటర్స్ మరియు కాప్స్ రాక్స్ సభ్యులే,పదివేళ్ళు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అని,కాప్స్ రాక్స్ సహాయంతోనే విశాఖపట్నం లో ఒక్క అడుగుతో మొదలైన బ్లడ్ సర్వీస్ ఈ రోజు భారతదేశంలో లక్ష అడుగుల ప్రయాణం చేస్తుంది అన్నారు.కాప్స్ రాక్స్ అందరికి ఆదర్శంగా నిలిచింది అన్నారు.
నిన్నటి తో 50 సారి రక్త దానం చేసి ఎందరికో స్ఫూర్తి ని ఇచ్చి తాసుబెల్లి ఫౌండేషన్ ద్వారా వేలాది ప్రాణాలు కాపాడిన తాసుబెల్లి శంకర్ నాయుడు కి కాప్స్ రాక్స్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.