నిరుపేదలకు దుప్పట్లు,పండ్లు,సానిటైజర్లు పంపిణీ
విశాఖపట్నం వాస్తవ నయనమ్ : కరోనా విపత్కర పరిస్థితులలో నిరంతరం తమ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివేకానంద స్వచ్ఛంద సంస్థ,గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు.శుక్రవారం ఇక్కడ వివేకనంద స్వచ్ఛంద సేవా సంస్థలో పలువురు అనాధలకు వృద్ధులుకు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన దుప్పట్లు,చీరలు పండ్లు,సానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జహీర్ పాల్గొని మాట్లాడుతూ కరోనా ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతిరోజు అనాధలకు,వృద్ధులకు,అల్పాహారం భోజన సదుపాయం అవసరమైనవి సమకూరుస్తూ ఉన్నామన్నారు.దీంతోపాటు రక్త నిల్వలు అత్యధికంగా అవసరం ఉన్నందున రక్తదానం అత్యంత అవసరమని ఇటువంటి సమయాల్లో రక్తదానం చేయడం ప్రాణ దానం కంటే ఎక్కువగా అభివర్ణించారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా విపత్తు లో ప్రతి రోజు ఏదో ఒక చోట పలు సేవా కార్యక్రమం లు నిర్వహిస్తున్నామన్నారు.నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్న మన్నారు.ఈ విపత్తు అధిగమించే వరకు దశలవారీగా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు ఈశ్వర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.