న్యూజిలాండ్‌లో ఎటువంటి కొత్త కరోనా కేసులు నమోదు కాలేదు. మే 4వ తేదీన ఎటువంటి కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం పేర్కొన్నది. మార్చి 16వ తేదీ తర్వాత పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. కొత్తగా మరణించిన కేసులు కూడా లేవు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల మరణించిన వారి సంఖ్య 20కు చేరుకున్నది. 1137 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రతి రోజూ సింగిల్ డిజిట్‌లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసులు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మళ్లీ వ్యాపారాలు మొదలయ్యాయి.
న్యూజిలాండ్‌లో జీరో కేసులు..