విపత్కర సమయంలో మద్యపానం నిషేధించాలని -అనకాపల్లి జనసేన


అనకాపల్లి వాస్తవ నయనమ్:కరోనా పై పోరాటం లో గత 43 రోజులుగా పోలీసు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది చేస్తున్న సేవలను నిన్న మద్యం దుకాణాలను తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజుతో పూర్తిగా నీరుగార్చింది అని జనసేన పార్టీ అధ్యక్షుడి యువ నాయకుల బృందం సభ్యులు మంగా ఈశ్వర్ అన్నారు.కరోనా విపత్కర సమయం లో మద్యం దుకాణాలను తెరవడం చాలా హీనమైన చర్య అని,దీని వలన ప్రజలు గంటల తరబడి కిలోమీటర్లు మేర క్యూ లో కనీసం సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు దరించకుండా ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి కి సహకరిస్తున్నారు అని పేర్కొన్నారు. కావున వెంటనే మద్యం దుకాణాలను మూసివేసి ప్రజలను అప్రమత్తం చేయాలని,లేని యెడల మద్యం దుకాణాల వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ పట్టణ నాయకులు తాకాశి సత్యందొర తో కలిసి అనకాపల్లి ఆర్డీవో మరియు జీవీఎంసీ జోనల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కోట్ని సూరిబాబు,బుద్ధ రాందాస్,వాకాడ సతీష్,మద్దాల రాంజీ,యాలకుల ధర్మ,వెంకటేష్,పవన్ తదితరులు పాల్గొన్నారు.