గిరిజన గ్రామాల్లో సేవలు నిరుపమానం

పలువురికి నిత్యావసరాల పంపిణీ


సింహాచలం వాస్తవ నయనమ్ : సింహగిరి గిరిజన గ్రామాల్లో నిరంతరం సేవలు అందించడం అభినందనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.శనివారం ఉదయం అడవివరం సొసైటీ డైరెక్టర్ బంటుపల్లి మహేష్ ఏర్పాటుచేసిన పలు నిత్యవసర వస్తువులను శ్రీనుబాబు చేతుల మీదుగా గిరిజనులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వంటి కష్టకాలంలో దాతలు స్పందిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు.ఈ విపత్తు లో ప్రతి ఒక్కరూ ఎవరికివారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించడం మరపురాని గొప్ప విషయమన్నారు.నిరుపేదలను దృష్టిలో ఉంచుకొనే
నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో తాను కూడా సేవలు అందించడం జరుగుతుందన్నారు.ఇప్పటికే తన సొంత నిధులతో సుమారు 600 మందికి నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు.దీనితో పాటు వృద్ధులు అనాధాశ్రమాలుకు కూడా సాయం అందిస్తున్నట్లు  పేర్కొన్నారు.సింహ గిరి గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్న బంటుపల్లి మహేష్ ను శ్రీనుబాబు అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సోడదాస్ సుధాకర్,గంట్ల కిరణ్ బాబు,తిరుమలరెడ్డి సుధీర్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.