పలువురు సేవకులకు సత్కారం,నిత్యావసరాల పంపిణీ
విశాఖపట్నం వాస్తవ నయనమ్ : శ్రీ వివేకానంద వృద్ధుల,అనాధ ఆశ్రమంలో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సేవకులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ, సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అన్నారు.తల్లిని పూజిస్తే ఆది దేవతలను పూజించినట్లే అని మాతృమూర్తి గొప్ప తనము వివరించారు.ఈ సందర్భంగా పలువురికి నిత్యావసర వస్తువులను అందజేశారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు.చిన్నప్పటినుంచి ఆలనాపాలనా చూడటంతో పాటు మనలను నడిపించేది తల్లిదండ్రులు మాత్రమే అన్నారు.ఇక అందులో తల్లి పాత్ర మరింత అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మక్సూద్ అహ్మద్,సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు ఇతర సభ్యులు పాల్గొన్నారు.