దేముని గుమ్మం జన సైనికుల ఆధ్వర్యంలో నిత్యాన్నదానం

అనకాపల్లి వాస్తవ నయనమ్


కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు యాచకులకు సాధువులకు అనకాపల్లి దేముని గుమ్మం బొయినవారి వీధి జనసైనికులు నిత్యాన్నదానం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతి మనిషి ఆకలి తీరాలి అనే సంకల్పంతో ఈ మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభించారు.జనసైనికులు వారే స్వయంగా భోజనం తయారు చేసి పేద ప్రజలకు యాచకులకు సాధువులకు పంపిణీ చేశారు.జనసైనికులు మాట్లాడుతూ లాక్ డౌన్ ఎంత వరకు పొడిగిస్తే అంతవరకు పేదల ఆకలి తీరుస్తాం అన్నారు.ఆదివారం చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి గరికపాటి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గరికిపాటి వెంకటేశ్వర రావు సహాయ సహకారాలు అందించారు.ఈ కార్యక్రమంలో గోలి మురళి అందే చంద్రశేఖర్ బొలిశెట్టి భాస్కరరావు గేదెల విజయ్ కుమార్ కసిరెడ్డి భాను ప్రకాష్ కల్లూరు ఈశ్వరరావు కల్లూరి శివ కుమార్ గేదెల స్వామి అందే రామ్ కుమార్ సిద్ధ జయంత్ రెడ్డి పల్లి వెంకటేష్ తిమ్మ పాత్రుని నాగేశ్వరరావు తల్లపరెడ్డి చందు తిమ్మా పాత్రుని మహేష్ మారిశెట్టి యశ్వంత్ లెక్కల కోటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.