వాస్తవ నయనమ్ యలమచిలి
యలమచిలి గ్రామంలో ఆకాంక్ష చిల్డ్రన్ ఫౌండేషన్ వారు నేడు 100 నిరుపేద కుటుంబాలకు,రోజు కూలీ కుటుంబాలకు (బియ్యం,కందిపప్పు, నూనీ,సబ్బులు,కారం,ఉప్పు) వంటినిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 350 నిరుపేద మరియు రోజు కూలీ కుటుంబాలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు.అంతే కాకుండా ప్రతి రోజు నీరశ్రయులకు మరియు ప్రేమసమజం ఆశ్రమానికి ఉదయం పూట అల్పాహారం అందజేస్తున్నారు.ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆకాంక్ష చిల్డ్రన్ ఫౌండేషన్ టీం సభ్యులు కొనగళ్ల రామకృష్ణ,సూర్యనారాయణ,ప్రదీప్ కుమార్,సాయిరాం,రాజు, సోమనాథ్ గుప్తా,పవన్ కుమార్,మోహన్,అశోక్ సాయి, సాయిరాం, రాజు,మనోజ్ కుమార్,మూర్తి బాబు,విజయ్ పాల్గొన్నారు.