అనకాపల్లి వాస్తవ నయనమ్: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు జన్మదిన వేడుకలు అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనకాపల్లి తాకాశి వీధిలో 300 మంది నిరుపేదలకు మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు.తరువాత అతి తక్కువ సంఖ్యలో సామాజిక దూరం పాటిస్తూ పేదల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ సంవత్సరం తన జన్మదిన వేడుకలకు భాస్కరరావు పూర్తి దూరంగా ఉన్నారని,కానీ తమ కార్యకర్తలకు పూర్తి అందుబాటులో ఉన్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ నాయకులు,జనసైనికులు,పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా పరుచూరి జన్మదిన వేడుకలు