విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 9 కి చేరిన మృతుల సంఖ్య..
గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. రసాయనక గ్యాస్ ప్రభావంతో భారీగా అస్వస్థతకు గురయ్యారు. వారిందరిని ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్,ఇతర ప్రముఖులు సంఘటనపై ఆరా తీశారు. కాసేపట్లో జగన్ విశాఖకు చేరుకోనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో మృతి
చెందినవారు వీరే..
* కుందన శ్రేయ (6)
* ఎన్. గ్రీష్మ (9)
* చంద్రమౌళి (19)
* గంగాధర్
* నారాయణమ్మ (35)
* అప్పల నరసమ్మ (45)
* గంగ రాజు (48)
* మేకా కృష్ణమూర్తి (73)తోపాటు మరొక వ్యక్తి
గ్యాస్ లీక్ బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. స్థానిక కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందున్న వారితో మాట్లాడి ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ దుర్ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
కాగా, గురువారం తెల్లవారుజామున ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మింది మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.