ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించడం అదృష్టం

గర్భిణీ స్త్రీలకు అల్పాహారం,పండ్లు పంపిణీ


విశాఖపట్నం వాస్తవ నయనమ్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి  ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం అందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,  వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఇక్కడ ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి లో గర్భిణీ స్త్రీలకు, అల్పాహారం,పండ్లు శ్రీనుబాబు చేతుల మీదుగా అందజేశారు.వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు సేవలు చేయడం ప్రతి ఒక్కరు తమ అదృష్టం గా భావించాలన్నారు.ఇక వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ, కరోనా ప్రారంభమైనప్పటినుంచి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.ఈ సంస్థ ద్వారా అనాధ లను ఆదుకోవడం జరుగుతుంది అన్నారు.తన సొంత నిధులతో. బుధవారం గర్భిణీ స్త్రీలకు పండ్లు అందజేయడం జరిగిందని శ్రీనుబాబు చెప్పారు.ప్రభుత్వ ఆస్పత్రిల లో వైద్యం పొందుతున్న వారికి ఇటువంటి సమయంలో పౌష్టికాహారం అత్యంత అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు,సభ్యులు సోంబాబు,అప్పలకొండ,దూడ రాజు తదితరులు  పాల్గొన్నారు.