ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని మరోసారి వినతి
విశాఖపట్నం వాస్తవ నయనమ్ : నగర పరిధిలో ఉన్న పలువురు జర్నలిస్టులకు(ముస్లిం) జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు రంజాన్ కానుకలు అందజేశారు.సోమవారం ఇక్కడ అక్కయ్యపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతియేటా రంజాన్ పర్వదినము సందర్భంగా పలువురు జర్నలిస్టులకు తన సొంత నిధులు తో నిత్యవసర వస్తువులు ఇతర సామాగ్రి అందజేస్తూ వస్తున్నామన్నారు.అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా పలువురికి నిత్యావసర వస్తువులు కొనుగోలుకు నగదు అందజేసామన్నారు.ఒక్కక్కరికీ 2000/- నగదు అందజేసామని వాటితో వారికి అవసరం ఐన బట్టలు ఇతర సామాగ్రి కొనుగోలు చేసుకుంటారన్నారు.సమాజం కోసం పాటుపడే జర్నలిస్ట్ లకు 50 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లకు వినతిపత్రంలు అందచేశామన్నారు.ఐన మరోసారి విజ్ఞప్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు మౌలానా,గయాజ్,రఫీ,ఇస్మాయిల్,సాధిక్,బాషా తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.