విశాఖపట్నం వాస్తవ నయనమ్: వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించకపోవడంతో దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి ఉంచి మోస్తారు వర్షలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కాగా, అల్పపీడనం మరో నాలుగు రోజులు అక్కడే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
స్థిరంగా అల్పపీడనం: మోస్తరు వర్షాలు