అనకాపల్లి వాస్తవ నయనమ్: లాక్ డౌన్ ప్రారంభం నాటి నుండి అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరంతర అన్నదాన కార్యక్రమం ఈరోజు భారీ అన్నదానంతో ముగింపు జరిగింది.అనకాపల్లి రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ని రోజుల నిరంతర అన్నదానం కార్యక్రమం చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది అని అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన ప్రెసిడెంట్స్ లీడర్స్ సభ్యులు మంగా ఈశ్వర్ మరియు పట్టణ నాయకులు తాకాశి సత్యందొర మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో ఎటువంటి వివక్ష లేకుండా కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి రోజు 250 మంది నిరుపేదలకు, పోలీసు సిబ్బందికి రెండుసార్లు భోజనం ఏర్పాటు మరియు గ్లూకోజ్ బాటిల్స్ పంపిణీ చేశామని,ఈ కార్యక్రమాన్ని మెచ్చి ఎంతో మంది దాతలు స్వచ్చందంగా తమ సహకారాలు అందించారని అన్నారు.ఈ కార్యక్రమానికి మొదటి నుండి సహకరించిన పోలీసు సిబ్బంది కి,జీవీఎంసీ సిబ్బంది కి,విలేకరులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శ్రీరాందాస్ గోవింద్,తాడి రామకృష్ణ,వేలం నూకరాజు,లాయర్ కిశోర్,లాయర్ కళావతి,దూలం గోపి,బుద్ధ రాందాస్,కరణం నాయుడు,కలగా చిరంజీవి,పెదిశెట్టి దుర్గ,యాలకుల ధర్మ,యాలకుల సత్య,గంగుపాం జగదీష్,నవీన్,మద్దాల రాంజీ,సంతోష్,తాకాశి మురళి,కిషోర్, సునీల్,అనిల్,అశోక్,అనకాపల్లి పట్టణ జనసైనికులు పాల్గొన్నారు.