-అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి/కశింకోట వాస్తవ నయనమ్:
అనకాపల్లి కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో ఇటీవలే ఒక వ్యక్తికి కరోన పాజిటివ్ రావడంతో గత ఏడు రోజుల నుంచి రెడ్ జోన్ గా ప్రకటించినప్పటి నుంచి గ్రామ ప్రజలు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.అదే సమయంలో చింతలపాలెం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడు వైరాల సత్తిబాబు సతీమణి నాగమణి గత సంవత్సర కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు.రెడ్ జోన్ కారణంగా హాస్పిటల్ కి వెళ్లడానికి,మందులు వేసుకోవడానికి అవకాశం లేదు.దీంతో గత నాలుగు రోజుల నుంచి పర్మిషన్ కోసం వేచి చూస్తున్న సమయంలో సత్తిబాబు విసుగుచెంది ఫేస్ బుక్ లో మెసేజ్ పోస్ట్ చేసారు.ఈ మెసేజ్ ను చూసిన అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ తక్షణమే స్పందించి ఆమెకి కావాల్సిన మందులు స్వయంగా ఇంటికి పంపించడం జరిగింది.ఆమె చికిత్స నిమిత్తం ఈరోజు హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రత్యేక అంబులెన్సుని ఏర్పాటు చేసి,ఆర్థిక సహాయం అందించి విశాఖపట్నం పంపించారు.ఎలాంటి సమయంలోనైనా ఒక నాయకుడులా కాకుండా సేవకుడిలా సేవా దృక్పథంతో మీకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.గుడివాడ అమర్నాథ్ సేవలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.ఇదే కాకుండా లాక్ డౌన్ సమయం లో ప్రజలకు పోలీస్ వ్యవస్థకు,హెల్త్ సిబ్బందికి,పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు.
https://www.facebook.com/amarnath.gudivada/videos/227053638598573/