అనకాపల్లి వాస్తవ నయనమ్ : దిబ్బపాలెం గ్రామ పర్యటనకు వెళ్లిన అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ చేతులమీదుగా వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పెద్దాడ అచ్చియ్యమ్మ తనయుడు వైస్సార్సీపీ యువనాయకులు పెద్దాడ రామ శంకర్ తన సొంత నిధులుతో సమకూర్చిన బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలును దిబ్బపాలెం పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులుకి,ఆశా కార్యకర్తలుకి మరియు వాటర్ ట్యాంక్ ఆపరేటర్లు కి పంపిణీ చేసారు.అలాగే ప్రతి ఇంటికి మాస్క్ లు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.అలాగే బాలింతలకు పోషకాహారం పంపిణీ చేసారు.అలాగే సున్నా వడ్డీ ప్రోసీడింగ్స్ డ్వాక్రా మహిళలకు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో దిబ్బపాలెం వైసిపి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అమరనాథ్ చేతులమీదుగా బియ్యం, కూరగాయలు పంపిణీ