అమరావతి వాస్తవ నయనమ్ :ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,292 శాంపిల్స్‌ను పరీక్షించగా 67 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 524 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1093 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 19,చిత్తూరు జిల్లాలో 1,కడప జిల్లాలో 4,కృష్ణా జిల్లాలో 12,కర్నూలు జిల్లాలో 25, విశాఖపట్నం జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు (మొత్తం 1650)