న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సుమారు 14,800 మందిని తరలించడానికి 64 విమానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని విమానాలు బుధవారం వెళ్లనున్నాయని తెలసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. విదేశీ విమానాలను దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయూలు స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది.