వాస్తవ నయనమ్
మందు బాబులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. అంటే ఇప్పటి వరకూ మొత్తం 75 శాతం పెంచిందన్న మాట. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల సంఖ్య 3,468. మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకే ఇలా ధరల పెంచుతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం జే ట్యాక్స్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.