400 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా

సంఘ సేవకులు డాక్టర్ జహీర్  అహ్మద్ చేయూత



విశాఖపట్నం/పాత పోస్ట్ ఆఫీస్ వాస్తవ నయనమ్ : ప్రముఖ సంఘ సేవకులు శ్రీ వివేకానంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్  మరోసారి నిరుపేదలకు ఆపన్నహస్తం అందించారు.ఆదివారం పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న షాదీఖానా కళ్యాణమండపం లో సుమారు నాలుగు వందల ముస్లిం కుటుంబాలకు తన సొంత నిధులతో రంజాన్ తోఫా అందజేశారు.తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఒక కిట్టు గా తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జహీర్  మాట్లాడుతూ ప్రతి ఏటా తన సంస్థ ద్వారా మిగులు లాభాల్లో రెండున్నర శాతం నిరుపేద ప్రజల సేవా కార్యక్రమాల కోసం కేటాయిస్తామన్నారు.చాలా కాలం నుంచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.ఎంత మేరకు లాభాలు మిగిలినప్పటికీ అందులో కచ్చితంగా కొంతమేరకు పేదల కోసం  కేటాయించడం జరుగుతుంది అన్నారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సంఘ సేవకులు డాక్టర్ జహీర్ అహ్మద్ సేవలను కొనియాడారు.కరోనా వంటి విపత్తులు సంభవించిన ఈ సమయంలో కూడా డాక్టర్ జహీర్ తన పెద్ద మనసుతో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడం ప్రశంసనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మక్సూద్ అహ్మద్, పాత నగరానికి చెందిన అహ్మద్ అలీ ఖాన్,బాషా,వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.