దేశంలో 24 గంటల్లో 3900 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదవగా, 195 మంది మరణించారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ ప్రభావంతో 1568 మంది మృతి చెందారు. 32,138 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 12727 మంది బాధితులు కోలుకుని ఆస్పతృల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది