విశాఖపట్నం వాస్తవ నయనమ్
కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీని వలన ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రక్త దానం గాని బ్లడ్ స్టోరీస్ సెంటర్స్ గాని రక్తాన్ని సరఫరా చేయలేక పోతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చోడవరంలో ఒక వ్యక్తికి రక్తం అవసరం అయింది.వెంటనే వైజాగ్ ఈస్ట్ కాప్స్ రాక్స్ గ్రూప్ సభ్యులు సాయిరాం స్పందించి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చోడవరం కాప్స్ రాక్స్ సభ్యులు మాట్లాడుతూ సాయిరాం 20వ సారి రక్తం దానం చేశారని తెలిపారు.ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సాయిరాం ముందుండి కాప్స్ రాక్స్ కి సేవలు అందించడాని చోడవరం కాప్స్ రాక్ సభ్యులు మరి విశాఖ క్యాప్స్ రాక్స్ సభ్యులు కొనియాడారు.