మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

 మూడు జోన్లుగా దేశం 



  • రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు..  ఆరెంజ్‌లో 284,  గ్రీన్‌జోన్‌లో 319

  • జోన్లవారీగా మినహాయింపులు

  • జోన్లతో నిమిత్తం లేకుండా కొన్నింటిపై నిషేధం

  •  విమాన, రైలు, మెట్రో సర్వీసుల రద్దు కొనసాగింపు.. 

  • మత కార్యక్రమాలు, ప్రార్థనా స్థలాలకు నో పర్మిషన్‌

  • విద్యాసంస్థలు, మాల్స్‌, థియేటర్లు, హోటళ్లు మూతే


 


లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని మొత్తం జిల్లాలను మూడు జోన్లుగా విభజించింది.  వైరస్‌ వ్యాప్తి, కేసుల రెట్టింపు రేటు, టెస్టింగ్‌ విస్తృతి, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా వర్గీకరించింది. 130 జిల్లాలను రెడ్‌ జోన్‌లో, 284 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చింది. రెండో విడుత లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం, మే 3 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వారంపాటు ఈ వర్గీకరణ ఆధారంగా ఆయా జిల్లాల్లో కంటైన్మెంట్‌ కార్యకలాపాలను అమలుచేయాల్సి ఉంటుంది. వారం వారం సమీక్ష జరిపి ఈ జాబితాను సవరిస్తారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సూడాన్‌ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. మొత్తం కేసులు, రెట్టింపు రేటు ఆధారంగా ఇంతకుముందు జిల్లాలను ఆయా జోన్లుగా విభజించేవారమని చెప్పారు. అయితే రికవరీ రేటు పెరిగినందున, అందుకనుగుణంగా ప్రస్తుతం జోన్లను విభజిస్తున్నట్లు తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని రెడ్‌/ఆరెంజ్‌ జోన్లను ప్రకటించవచ్చని, అయితే కేంద్ర జాబితాలో సడలింపులు ఇచ్చేందుకు వీల్లేదని స్పష్టంచేశారు.


 రెడ్‌జోన్  ‌



  • రెడ్‌జోన్లలో కంటైన్మెంట్‌ ప్రాంతాలకు వెలుపల పలు కార్యకలాపాలపై నిషేధం విధించారు. అవి: రిక్షాలు, ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లు, అంతర్‌ జిల్లాతోపాటు జిల్లా లోపల బస్సు ప్రయాణాలు, బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్లు.

  • రెడ్‌జోన్లలో షరతులతో పలు కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. అనుమతించిన వాటికి మాత్రమే వాహనాల రాకపోకలు సాగించవచ్చు. నాలుగు చక్రాల వాహనాల్లో డ్రైవర్‌తోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ద్విచక్రవాహనాల్లో ఒక్కరు మాత్రమే వెళ్లాలి. 

  • పట్టణాల్లో సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌లకు అనుమతి.  

  • మందులు, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు, వాటి ముడి సరుకులకు సంబంధించిన అత్యవసర ఉత్పత్తుల తయారీ సంస్థలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

  • నిరంతరం కొనసాగించాల్సిన ఉత్పత్తి యూనిట్లకు, వాటి సప్లయ్‌ చైన్‌లకు అనుమతి.

  • షిప్టులతో జూట్‌ పరిశ్రమలకు అనుమతి. ఐటీ, హార్డ్‌వేర్‌ తయారీ సంస్థ లు పనిచేస్తాయి. ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ తయారీ సంస్థలకు గ్రీన్‌సిగ్నల్‌. 

  • బయట నుంచి కార్మికులను తరలించాల్సిన అవసరంలేకుండా స్థానికంగానే కూలీలు లభించే పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి. 

  • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను అనుమతి.

  • పట్టణాల్లో మాల్స్‌, మార్కెట్స్‌, మార్కెట్స్‌ కాంప్లెక్స్‌లలో అత్యవసరం కాని సరుకుల విక్రయ దుకాణాలకు అనుమతి నిరాకరణ. అయితే అత్యవసరం, అత్యవసరం కానివి అన్న వాటితో నిమిత్తం లేకుండా.. సింగిల్‌ షాపులు, కాలనీలు, రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌లలో ఉండే దుకాణాలకు అనుమతినిచ్చారు. 

  • ఈ-కామర్స్‌లో అత్యవసర సరుకులకు మాత్రమే అనుమతి. 

  • 33 శాతం సిబ్బందితో ప్రైవేట్‌ సంస్థలు నడిపేందుకు ఆమోదం తెలిపారు. మిగిలిన వారు వర్క్‌ఫ్రమ్‌ హోం చేయాల్సి ఉంటుంది. 

  • అన్ని ప్రభుత్వ సంస్థలు నడిచేందుకు అనుమతి. డిప్యూటీ సెక్రటరీ స్థాయి, ఆ పై అధికారులు అందరూ హాజరుకావచ్చు. మిగతా సిబ్బందిలో 33 శాతం మందికి మాత్రమే అనుమతి. అయితే రక్షణ, భద్రతా సేవలు, వైద్య, కుటుంబ సంక్షేమం, పోలీస్‌, జైళ్లు, హోం గార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తు నియంత్రణ-సంబంధిత సేవలు, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌, కస్టమ్స్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌సీసీ, నెహ్రూ యువక్‌ కేంద్ర, మున్సిపల్‌ సేవలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి. 




  • గ్రామీణ ప్రాంతాల్లో.. ఉపాధి పనులు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇటుకల బట్టీలు సహా అన్ని పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాలను కొనసాగించవచ్చు. షాపింగ్‌ మాల్స్‌ తప్ప అన్ని దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌.

  • అన్ని రకాల వ్యవసాయ కార్యక్రమాలకు ఆమోదం.

  • పశుపోషణకు పూర్తిగా అనుమతి 

  • ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌తో సహా అన్ని ప్లాంటేషన్‌ కార్యక్రమాలను అనుమతి.

  • ఆయుష్‌ సహా అన్ని రకాల వైద్య సేవలు కొనసాగుతాయి. 

  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీల సేవలు కొనసాగుతాయి. 

  • వృద్ధాశ్రమాలు, అనాథలు, పిల్లలు, వితంతువులు, మహిళా సంరక్షణ కేంద్రాలు పనిచేస్తాయి. 

  • అంగన్‌వాడీ కేంద్రాలకు అనుమతి.

  • విద్యుత్‌, నీరు, శానిటేషన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టెలీకమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌, కొరియర్‌, పోస్టల్‌ వంటి ప్రజా సేవలు కొనసాగుతాయి.

  • ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, కాల్‌సెంటర్లు, శీతల గిడ్డంకులు, గోదాములు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలకు అనుమతినిచ్చారు. 

  • బార్బర్లు మినహా స్వయం ఉపాధి పొందే వ్యక్తులు పనిచేసేకునేందుకు అనుమతి.


 ఆరెంజ్‌ జోన్  ‌


రెడ్‌జోన్లలో అనుమతించినవాటికి అదనంగా ఆరెంజ్‌ జోన్లకు పలు సడలింపులు ఇచ్చారు. 



  • కేవలం డ్రైవర్‌, ఒక ప్రయాణికుడితో క్యాబ్‌ సేవలకు అనుమతి.

  • అనుమతించిన కార్యకలాపాలకు అంతర్‌జిల్లా ప్రయాణాలకు ఆమోదం.

  • నాలుగు చక్రాల వాహనంలో డ్రైవర్‌ కాకుండా గరిష్టంగా ఇద్దరికి అనుమతి. ద్విచక్రవాహనాల్లో ఇద్దరు ప్రయాణించవచ్చు.


 గ్రీన్‌ జోన్ ‌


జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా నిషేధం విధించిన కార్యకలాపాలకు మినహా మిగిలిన అన్నింటికీ గ్రీన్‌జోన్‌లో అనుమతి ఉంటుంది.



  • 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడుపవచ్చు. 50 శాతం సిబ్బందితో బస్సు డిపోలు కొనసాగవచ్చు.

  • అన్ని జోన్లలోనూ 65 ఏండ్లుపైబడిన వారు, ఇతర రోగాలు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏండ్ల లోపు పిల్లలు ఇండ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. 

  • ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు అత్యవసరం కాని కార్యకలాపాలకు సంబంధించి వ్యక్తుల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. దీన్ని కఠినంగా అమలుచేసేందుకు స్థానిక అధికారులు సెక్షన్‌ 144 వంటి నిషేధాజ్ఞలను జారీచేయవచ్చు. వైద్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తిరగకూడదు. 

  • నిర్ణీత దూరం, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో అవుట్‌ పేషెంట్‌ విభాగాలకు, క్లినిక్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం వీటికి అనుమతి లేదు. 


జోన్లతో నిమిత్తం లేకుండా నిషేధం ఉన్న రంగాలు



  • దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సేవలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా

  • స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్య, శిక్షణా సంస్థలు

  • హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, క్రీడా కాంప్లెక్సులు 

  • సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు

  • ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనామందిరాలు, మతపరమైన కార్యక్రమాలు


మద్యానికి అనుమతి



  • అన్ని జోన్లలో (కంటైన్మెంట్‌ జోన్లు మినహా) లిక్కర్‌, పాన్‌, టొబాకో విక్రయాలకు అనుమతి. అయితే నిర్ణీత దూరం పాటించడం తప్పనిసరి. షాపు వద్ద ఐదుమంది కంటే మించి గుమిగూడకూడదు. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీటి వాడకంపై నిషేధం విధించారు.

  • కంటైన్మెంట్‌ జోన్లలో నివసించేవారు ఆరోగ్యసేత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం తప్పనిసరి

  • బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసిరి. 

  • వివాహాది శుభకార్యాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి లేదు. 

  • నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఉల్లంఘన వల్ల ఏదైనా ప్రాణనష్టం సంభవిస్తే రెండేండ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. 

  • అన్ని రకాల గూడ్స్‌ రవాణాకు అనుమతి 



రెడ్‌ జోన్‌:



  • వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న ప్రాంతం


కంటైన్మెంట్‌ జోన్‌: రెడ్‌ జోన్‌లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రదేశం


ఆరెంజ్‌ జోన్‌: వైరస్‌ అదుపులోకి వస్తున్న ప్రాంతం



  • రెడ్‌జోన్లలో అనుమతించినవాటికి అదనంగా ఆరెంజ్‌ జోన్లకు పలు సడలింపులు ఇచ్చారు. 

  • కేవలం డ్రైవర్‌, ఒక ప్రయాణికుడితో క్యాబ్‌ సేవలకు అనుమతి.

  • అనుమతించిన కార్యకలాపాలకు అంతర్‌జిల్లా ప్రయాణాలకు ఆమోదం.

  • నాలుగు చక్రాల వాహనంలో డ్రైవర్‌ కాకుండా గరిష్టంగా ఇద్దరికి అనుమతి. ద్విచక్రవాహనాల్లో ఇద్దరు ప్రయాణించవచ్చు.



 


గ్రీన్‌జోన్‌: 



  • గత 21 రోజులుగా పాజిటివ్‌ కేసు నమోదుకాని ప్రాంతం



  • ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌ వంటి మెట్రోపాలిటన్‌ నగరాలన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. 

  • ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలను రెడ్‌ జోన్‌ జాబితాలోనే చేర్చారు. 

  • ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 19 జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. మహారాష్ట్రలో 14, తమిళనాడులో 12, పశ్చిమబెంగాల్‌లో 10, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో తొమ్మిది చొప్పున రెడ్‌ జోన్‌ జిల్లాలు ఉన్నాయి. 

  • గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, సిక్కిం, నాగాలాండ్‌, మిజోరం పూర్తిగా గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. 

  • అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, పుదుచ్చేరి, లడఖ్‌లలో ఒక్క రెడ్‌జోన్‌ జిల్లా కూడా లేదు. 




అన్ని జోన్లలోనూ 65 ఏండ్లుపైబడిన వారు, ఇతర రోగాలు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏండ్ల లోపు పిల్లలు ఇండ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. 


ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు అత్యవసరం కాని కార్యకలాపాలకు సంబంధించి వ్యక్తుల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. దీన్ని కఠినంగా అమలుచేసేందుకు స్థానిక అధికారులు సెక్షన్‌ 144 వంటి నిషేధాజ్ఞలను జారీచేయవచ్చు. వైద్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తిరగకూడదు. 


 


నిర్ణీత దూరం, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో అవుట్‌ పేషెంట్‌ విభాగాలకు, క్లినిక్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం వీటికి అనుమతి లేదు.