ఏపీలో భార్య‌ను న‌రికి చంపి వృద్ధుడి ఆత్మ‌హ‌త్య


పశ్చిమ గోదావరి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పశ్చిమ‌గోదావ‌రి జ‌ల్లాలో దారుణం జ‌రిగింది. ఓ వృద్ధుడు భార్య‌ను క‌త్తితో న‌రికి చంపి, అత‌ను పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని  నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో పసుపులేటి రంగారావు (62), భార్య కళావతి (55) దంప‌తులు నివ‌సిస్తున్నారు. ఇన్నాళ్లుగా విజయవాడలోని అద్దె ఇంట్లో ఉన్న ఈ వృద్ధ దంప‌తులు సుమారు రెండు నెలల క్రితం ఆవపాడులో ఇల్లు కొనుక్కొని అక్కడికి మ‌కాం మార్చారు. ఈ నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి గురువారం ఉద‌యం ఈ దారుణం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.