తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


కరోనా వైరస్‌ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన పార్టీ 20వ ఆవిర్భావ వేడుకల్లో నేతలు భౌతిక దూరాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.