కరోనా విపత్తులో ఏయూ సైకాలజిస్టులు ఉచిత సేవలు

  • ఉదయం నుంచి రాత్రి వరకు  కౌన్సిలింగ్

  • సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు


విశాఖపట్నం వాస్తవ నయనమ్ కరోనా  విపత్తులో ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం కి చెందిన నిపుణులు సేవలు(కౌన్సెలింగ్ ) సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా కరోనా  విజృoభిస్తున్న నేపథ్యంలో అనేకమంది ప్రజలు,యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో ఉచితంగా సేవలు అందించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ముందుకు వచ్చింది.ఈ మేరకు సైకాలజీ విభాగం అధిపతి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం వి ఆర్ రాజు ఆధ్వర్యంలో 16 మంది సైకాలజిస్ట్ లు తమ వంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజు ప్రకటించారు.ఇప్పటికే సైకాలజిస్టుల కు ఫోన్ల  ద్వారా సంప్రదించి పలువురు కౌన్సిలింగ్ తీసుకుంటున్న నేపథ్యంలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని 
డాక్టర్ ఎంవి అర్ రాజు నిర్ణయం  తీసుకున్నారు.ఆయన సూచనలు మేరకు కౌన్సెలింగ్ చేసే వారి వివరాలతో కూడిన జాబితాను ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం సీనియర్ విద్యార్థి గంట్ల శ్రీనుబాబు మంగళవారం కలెక్టర్  వినయచంద్ ను కలిసి వివరాలు ను అందజేశారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సూచించారు.సైకాలజిస్టులు కౌన్సిలర్లు తమ సేవలు అందించడానికి సిద్ధం గా ఉన్నట్లు వారు చెప్పారు.ఇటువంటి సమయం లో సేవలు అందించే విషయం అభినందనీయం అని కొనియాడారు.