అనకాపల్లి వాస్తవ నయనమ్ : అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుల యువ నాయకుల బృందం సభ్యులు మంగా ఈశ్వర్,పట్టణ నాయకులు తాకాశి సత్యం దొర మరియు విశాఖ వాసి కోట్ని నర్సింగరావు గారి ఆధ్వర్యంలో 32వ రోజు పేదలకు,యాచకులకు,వృద్దులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మద్దాల రాంజీ,ప్రకాష్,మురళీ, సంతోష్,అశోక్,అనిల్,సునీల్,తాకాశి వీధి జనసైనికులు పాల్గొన్నారు.ఇతివలె జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరి సేవలు గుర్తించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు.
అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పంపిణి