ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అందరి సహకారంతో కరోనా ని జయిద్దాం

పల్స్ స్   ఆధ్వర్యంలో 5,000 మందికి సామగ్రి అందజేత


విశాఖపట్నం వాస్తవ నాయనమ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ పల్స్ స్  కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సామాగ్రి అందచేసే కార్యక్రమంలో విజయ్ సాయిరెడ్డి మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు చేతులు మీదుగా  పోలీసులు జీవీఎంసీ పారిశుధ్య  సిబ్బంది.కార్మికులకు.అవసరం ఐన సామగ్రి అందజేశారు. సుమారు 5000 మంది కి సరిపోయే విధంగా కరోనా డ్రెస్స్ లు మాస్క్ లు సానిటైజర్లు పేస్ మాస్క్ లు ఎన్ 95 మాస్క్ లు భద్రతకు సంబంధించిన సామాగ్రి అంతా   వీరు  అందించారు.ఈ సందర్బంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రభుత్వం అన్ని  జాగ్రత్తలు తీసుకుంటు0దన్నారు కరోనా  పరీక్షలకు సంబంధించిన రాపిడ్ కిట్ లు కూడా  కూడా నగరానికి చేరుకున్నాయి అన్నారు.ఈ విపత్కర సమయం లో కూడా పలు స్వచ్ఛంద సంస్థలు కొన్ని పరిశ్రమలు  అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా  నేపథ్యంలో అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమంలు నిర్వహిస్తున్నారన్నారు.మరోవైపు ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందన్నారు.ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే,. కరోనా  అదుపులో ఉందన్నారు.విశాఖ ఎంపీ ఎంవివి  సత్యనారాయణ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తదితరులు మాట్లాడుతూ పల్స్ స్ సంస్థ  సేవలను  అభినందించారు.ఈ సమయం లో  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున సామగ్రి అందజేయడం ప్రశంసనీయమన్నారు. పల్స్ స్  సీఈవో గేదెల శ్రీనుబాబు పర్యవేక్షణలో ఆ కంపెనీ డైరెక్టర్  గేదెల  శంకర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు సంభవించిన ప్రతీ సారి తాము అనేక  సామాజిక సేవలు అందించేందుకు ముందువరుసలో ఉంటామన్నారు గతంలో కూడా అనేక సార్లు తమ కంపెనీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.ఈ కార్యక్రమం లో  జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాధ్  సన్యాసిరావు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు లంక మోహన్ రావు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పల్స్ స్ సిబ్బంది  పాల్గొన్నారు.