కరోనా విజృంభిస్తున్న క్రమంలో..సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్నట్లు ప్రకటించింది. అయితే రంజాన్ నేపథ్యంలో మసీదులను తెరచివుంచితే, కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మూసివేయాలని నిర్ణయించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. తరావీ నమాజ్ లను, రంజాన్ ఈద్ నమాజ్ ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కరోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియ సంచలన నిర్ణయం