నిత్యావసర సరుకులు పంపిణీ.
అక్కయ్యపాలెం వాస్తవ నయనమ్
అక్కయ్యపాలెం రామచంద్ర నగర్ లో గురువారం పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. మూవీ మైండ్స్ సంస్థ అధ్యక్షులు జేవి ప్రభాకర్,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సంయుక్తముగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాద్ సన్యాసి రావు పాల్గొన్నారు.అనంతరం పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు,వారి భద్రతకు సంబంధించిన సానిటైజర్లు,మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ కరోనా వంటి విపత్తులో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు.వారి సహకారం వల్లే కరోనా ను అదుపు చేసుకోగలిగా మన్నారు.రెడ్ జోన్ల పరిధిలో కూడా వారి ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారన్నారు.గ్రేటర్ లో కార్మికులుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు చర్యలు తీసుకున్నామన్నారు.ఈ సందర్భంగా విజేఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించాలని భావించే ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నిరుపేదలు అందరినీ ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని సేవలు చేయడానికి ఇదే సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు.జేవీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిరోజు తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ 4 సహాయ మెడికల్ అధికారి రాజేష్,వార్డ్ ఇన్స్పెక్టర్ పాండురంగ,గోపి సుబ్రహ్మణ్యం,రాజకుమారి,గంట్ల హర్షవర్ధన్,సీతారామయ్య,పృద్వి తదితరులంతా పాల్గొన్నారు.