బాలివుడ్ నటుడు రంజిత్ చౌదరి కన్నుమూత

ఖట్టామీటా, ఖూబ్ సూరత్, బాతో బాతో మే వంటి కుటుంబ కథాచిత్రాల్లో నటించిన రంజిత్ చౌదరి (65) బుధవారం కన్నుమూశారు. ఈ సంగతి ఆయన సోదరి రాయెల్ పదంసీ ఒక ఇన్స్‌టాగ్రాం ప్రకటనలో తెలిపారు. ఓ బ్లాక్-అండ్-వైట్ ఫొటో కూడా ఆమె షేర్ చేశారు. గురువారం ముంబైలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మే 5న సంస్మరణ సమావేశం జరుగుతుందని పదంసీ వివరించారు. రంజిత్ చౌదరి ప్రముఖ రంగస్థల నటి పెరల్ పదంసీకి మొదటి భర్త వల్ల కలిగిన కుమారుడు. ప్రముఖ నాటక ప్రయోక్త, అడ్వర్టైజింగ్ దిగ్గజం ఆలిక్ పదంసీ అతనికి మారుటి తండ్రి అవుతారు. రంగస్థల కుటుంబం నుంచి వచ్చిన రంజిత్ సినిమాలతోపాటు రంగంస్థలం మీద కూడా అనేక పాత్రలు వేశారు