కరోనా లో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం

విజేఫ్  ఆధ్వర్యంలో భద్రతా  సామగ్రి పంపిణీ



విశాఖపట్నం వాస్తవ నయనమ్



కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న  సేవలు ప్రశంసనీయమని బాల సతీష్ కొనియాడారు సోమవారం ఇక్కడ విజేఫ్ వినోద వేదికలో పలువురు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు,వీడియో గ్రాఫర్ లకు,న్యూస్ ప్రెజెంటర్స్ కు,ఫోటో జర్నలిస్ట్ లకు అవసరమైన భద్రతా సామగ్రి అందజేశారు.వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మాస్క్లు,సానిటైజ ర్లు,గ్లౌజ్లు ఎలక్ట్రానిక్ మీడియా కి అవసరమైన లైవ్ స్టిక్ లు అందజేశారు.బాల సతీష్ మాట్లాడుతూ కరోనా ప్రారంభం నుంచి కూడా తమ సంస్థ ద్వారా పలువురు కి చేయూత  అందిస్తున్నామన్నారు.భవిష్యత్తులో కూడా తమ సేవలు కొనసాగుతాయన్నారు. మరిడి సంస్థ డైరెక్టర్ శివాజీ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం సమాజం కోసం పాటుపడుతూ ఉన్నారన్నారు.జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు సహకారము అందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జర్నలిస్టుల కు సంబంధించి ఆరు విడతలుగా అనేక రకాల భద్రతా సామాగ్రి ని సమగ్రంగా అందచేశామన్నారు.జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు.జర్నలిస్ట్ ల కు తక్షణమే 50 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని శ్రీనుబాబు కోరారు. విజేఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు  మాట్లాడుతూ   దశలవారీగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.ఇప్పటికే  జర్నలిస్ట్ ల కు అవసరమైన సామాగ్రి ని దశల వారీగా  అందజేసామన్నారు.ఈ కార్యక్రమంలో విజేఫ్  ఉపాధ్యక్షులు అర్. నాగరాజు పట్నాయక్, 
జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్,కార్యవర్గం సభ్యులు ఇరోతి  ఈశ్వరరావు,దొండ గిరిబాబు,జామి వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.