వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. కిమ్ ఆరోగ్యం మెరుగపడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అతనితో తనకు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పిన ట్రంప్.... కిమ్ బాగానే ఉన్నారని ఆశిస్తున్నానని అన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారమైతే, ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం ఏమైనా లభించిందా? అన్న ప్రశ్నకు మాత్రం ట్రంప్ సమాధానాన్ని ఇవ్వలేదు. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలియదని... కాని ఆయన బాగుండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
కిమ్ అనారోగ్య వార్తలపై స్పందించిన ట్రంప్