అనకాపల్లి వాస్తవ నయనమ్
విశాఖ జిల్లా అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పెద్దాడ అచ్చియ్యమ్మ తనయుడు వై ఎస్ ఆర్ సిపి నాయకులు పెద్దాడ రామ్ శంకర్ తన సొంత నిధులతో దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఊడేరు, అలఖైనపాలెం గ్రామాల్లో అనకాపల్లి మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు చేతుల మీదుగా 1500 మంది కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గొర్లి సూరిబాబు మరియు పెద్దాడ రామ్ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గుడివాడ అమర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ బారిన పడకుండా లాక్ డౌన్ పాటిస్తూ, ఇల్లకు పరిమితమైన కుటుంబాలకు పౌష్టిక ఆహారమైన కోడిగుడ్లను పంపిణీ చేసామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, , పాల్గొన్నారు.