కానిస్టేబుల్‌ను హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పర్సేగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుర్సం రమేశ్‌ సహాయక కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలో హత్య చేశారు. నేషన్‌ పార్క్‌ ఏరియా కమిటీ పేరుతో మృతదేహం వద్ద లేఖను వదిలి వెళ్లారు. 2006లో రమేవ్‌ సల్వజుడుంలో పనిచేసినప్పటి నుంచి ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని, సల్వజుడుం అంతం తరువాత ఎస్పీవోగా పనిచేసి ప్రస్తుతం సహాయక కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని అందుకే ప్రజా కోర్టులో శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు.