దొంగల చేతివాటం.. మద్యం మాయం

: చిత్తూరులోని ప్రముఖ డిస్టల్లరీస్‌ కంపెనీలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ డిస్టల్లరీఎస్‌ కంపెనీలో 100 కేసుల మద్యం బాటిళ్లు మాయం అయ్యాయి. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుటుంబానికి చెందిన ఈ కంపెనీలో గత వారం రోజులుగా దొంగలు సరుకు మాయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.